హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు శనివారం ప్ర జాభవన్లో భేటీ కానున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిషృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఇరు రాష్ర్టాల డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క, పవన్ కల్యాణ్ పాల్గొననున్నా రు.
వీరితోపాటు తెలంగాణ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రు లు, ఏపీ నుంచి మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ పాల్గొంటారని సమాచారం. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజన, షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీ, పదో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేదర్ వర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీ, విద్యుత్తు సంస్థల బకాయిలపై చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.24 వేల కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉండగా, తమకే తెలంగాణ రూ.7 వేల కోట్లు బకాయి ఉన్నదంటూ ఏపీ పట్టుబడుతున్నది.