Congress | ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.. ఇలా అయితే మళ్లీ గెలవలేం : మీనాక్షి నటరాజన్
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ : ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో జరిగిన ముఖాముఖిలో మీనాక్షి నటరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పథకాల ప్రభావం ప్రజల్లో లేదని.. ప్రచారంలో వెనుకబడ్డామని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో కాంగ్రెస్ బలహీనంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియాపై తీవ్రంగా పోరాడాలని ఎంపీ, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక నాయకుల పరస్పర ఫిర్యాదులపై ప్రత్యేకంగా ఆరా తీశారు. చిన్న విషయాలపై గొడవపడితే మళ్లీ గెలవలేమంటూ వివాదాస్పద నేతలు కొండా సురేఖ, కడియం, శివ చరణ్ రెడ్డి తదితరులకు క్లాస్ తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టులపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డిలతో ప్రత్యేక చర్చలు చేస్తామన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్యూమరేషన్‌ను సీరియస్‌గా తీసుకోవాలంటూ మీనాక్షి సూచించారు.
ఇలా అయితే మళ్ళీ గెలవలేం
కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే, కీలక నేతల ముఖాముఖిలో మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
కాంగ్రెస్ పథకాల ప్రభావం ప్రజల్లో లేదని.. ప్రచారంలో వెనుకబడ్డామని అసంతృప్తి
సోషల్ మీడియాలో కాంగ్రెస్ బలహీనంగా ఉందని.. గట్టిగా ఫోకస్ చేయాలని హితవు
బీఆర్ఎస్ సోషల్ మీడియాపై తీవ్రంగా… pic.twitter.com/gvkHHxNeSX
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

