హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తేతెలంగాణ) : 2017 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లకే కమిటీల్లో చోటు కల్పించాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. కమిటీల్లో మహిళల ప్రా ధాన్యం పెంచుకోవాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో పీసీసీ పరిశీలకుల సమావేశం జరిగింది. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు జిల్లాస్థాయి సమావేశాలు జరుగనున్నట్టు మీనాక్షి నటరాజన్ తెలిపారు.
మీనాక్షి నటరాజన్ ఎంపీలు, ఎమ్మెల్యేల తో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. డీసీ సీ, బ్లాక్, మండల కమిటీల ఎంపికకు పీసీసీ పరిశీలకుల నియామకంపై చర్చించారు. అంతకు ముందు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీనాక్షితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల పార్టీ సీనియర్ నేత జానారెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చినట్టు సమాచారం. అనంతరం రాజగోపాల్‌రెడ్డి.. జానారెడ్డి ఎపిసోడ్‌పై స్పందించారు. ‘జానారెడ్డి అంటే తనకు గౌరవం. ఆయన మా పార్టీ సీనియర్ నేత. జానారెడ్డి రాసిన లెటర్‌పై ఒక సభలో మాట్లాడాను. తనకు మంత్రి పదవి అనేది అధిష్ఠానం తీసుకునే నిర్ణయం’ అంటూ చెప్పుకొచ్చారు.