Medico Suicide | ఖమ్మంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. మృతురాలిని సముద్రాల మానస (22) గా గుర్తించారు. విద్యార్థి కళాశాల ఎదురుగా ఉన్న హాస్టల్ నాలుగో అంతస్థులో ఉన్న గదిలో ఆత్మాహుతికి ఒడిగట్టింది. మానస స్థానికంగా ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతుంది. మానస స్వస్థలం మహబూబాబాద్ జిల్లాగా సమాచారం. అయితే, ఆత్యహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.