వినాయక్‌నగర్, ఆగస్టు 22: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న అండర్ ట్రయల్ ఖైదీ ఒకరు పారిపోయేందుకు మూడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన లకావత్ రాజుపై 2024లో ఇసుక అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆ కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంతో అతడిపై వారెంట్ జారీ అయింది.
దీంతో పోలీసులు రాజును ఈ నెల 18న అరెస్ట్ చేసి, నిజామాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న అతను శనివారం జైలులో స్పృహ లేకుండా పడిపోగా, సిబ్బంది ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ క్రమంలో రాజు పారిపోయేందుకు యత్నించి గాయపడ్డాడు.