హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు వైద్య కళాశాల్లో ఇంటర్న్స్, పీజీ విద్యార్థులకు ైస్టెపెండ్ చెల్లించాలని శనివారం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్యార్థులు నల్లబ్యాండ్లు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ‘జూడా’ల పిలుపు మేరకు చల్మెడ ఆనందర్రావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మమత మెడికల్ కాలేజీ, మహావీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కామినేని అకాడమీ, దక్కన్ మెడికల్ కాలేజీ, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, ఆర్వీఎం మెడికల్ కాలేజీలతోపాటు ఇతర ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో నిరసనలు కొనసాగాయి.
వీరికి సంఘీభావంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రతిరోజూ 12-18 గంటలు పనిచేస్తున్నామని వాపోయారు. అయినా మేనేజ్మెంట్లు తమకు ఒక్క రూపాయి ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ.. ైస్టెపెండ్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ైస్టెపెండ్ అందేలా చూడాలని డిమాండ్చేశారు.