Kamareddy | కామారెడ్డి, జనవరి 9 : డిగ్రీ ఫెయిల్.. కా నీ డాక్టర్‌గా అవతారమెత్తాడు. ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి స్పెషలిస్టు వైద్యుడిగా చెలామణి అయ్యాడు. పోలీసులు కూపీ లాగడంతో నకి లీ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. కామారెడ్డిలో చోటు చేసుకున్న ఈ కేసు వివరాలను ఏఎస్పీ చైతన్యారెడ్డి గురువారం వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మం దమర్రి మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ముల్కల రవీందర్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. డబ్బు సంపాదించాలనే యావ తో ఆర్ఎంపీల వద్ద కొంతకాలం పని చేసి, ప్రాథమిక వైద్యసేవల గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎండీ జనరల్ మెడిసిన్ చదివినట్టు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించాడు. వాటి తో కామారెడ్డి స్టార్ హాస్పిటల్, ఆరోగ్య దవాఖానతో పాటు లింగంపేట మండలం భీమరాజు దవాఖానలో పిల్లల వైద్యుడిగా చేరాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని షన్ముఖ దవాఖానలో పీడియాట్రిషియన్‌గా పని చేసేందుకు రూ.2 లక్షలు తీసుకున్నాడు. అనుమానం వచ్చిన కామారెడ్డి మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ డాక్టర్ బండారం బయటపడింది. దీంతో రవీందర్‌రెడ్డిని గురువారం అరెస్టు చేసి, అతడి నుంచి ఫేక్ ఆధార్ కార్డు, నకిలీ సర్టిఫికెట్లు, ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.