మహదేవపూర్, జూన్ 10 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంబటిపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ కల్యాణి అన్నారు. మంగళవారం అంబటిపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో గ్రామాల్లో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మురుగునీరు వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతోనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. వానకాలం పరిశుభ్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మాషుక్ అల, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.