నారాయణపేట : ప్రైవేట్ ఆస్పత్రి అనుమతి కోసం లంచం తీసుకున్న వైద్యాధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు . నారాయణపేట జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంపై గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కోస్గీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతి కోసం జిల్లా వైద్యశాఖ మాస్ మీడియా అధికారి హన్మంతు రూ. 80 వేలను డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు, ప్రైవేట్ ఆస్పత్రి మేనేజర్ కలాల ఆంజనేయులు గౌడ్ ఏసీబీని ఆశ్రయించాడు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా అతడిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.అతడిపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.