హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిసెంబర్ 3న ప్రారంభించనున్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, కేపీ వివేకానందగౌడ్, రాజశేఖర్రెడ్డి, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి తదితరులు సమీక్షించారు.
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్లో రైతులు కాళ్లు మొకినా వినకుండా బెదిరించి భూములు సేకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.