ములుగు : మేడారం జాతర భక్తులతో పులకించిపోయింది. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేదుకు శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్మానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకున్నారు.
సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దె వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతులు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
ముందస్తు మొక్కలలో భాగంగా గత వారం రోజులుగా రోజుకు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు తల్లుల దర్శనం చేసుకున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొవిడ్ నిబంధనల మేరకు ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లు చేశాయి.