తమిళ స్టార్ హీరో సూర్య దృష్టంతా ప్రస్తుతం తెలుగు దర్శకుల మీదే ఉంది. ఇప్పటికే ఆయన టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా మరో టాలీవుడ్ డైరెక్టర్ కథను కూడా ఆయన ఓకే చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
వివరాల్లోకెళ్తే.. దర్శకుడు పరశురామ్ ఇటీవలే సూర్యకు ఓ కథ వినిపించారట. సూర్యకు కూడా కథ నచ్చిందట. వారం పదిరోజుల్లో ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అన్నీ కుదిరితే దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. ఈ సినిమాకు చెందిన అధికారిక ప్రకటన ఉగాదికి రావచ్చని వినికిడి.