సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 22:07:50

ఈ యువ‌తిని, హైద‌రాబాద్‌ న‌గ‌రాన్ని దేవుడు ఆశీర్వ‌దించుగాక : సీపీ అంజ‌నీకుమార్‌

ఈ యువ‌తిని, హైద‌రాబాద్‌ న‌గ‌రాన్ని దేవుడు ఆశీర్వ‌దించుగాక : సీపీ అంజ‌నీకుమార్‌

హైదరాబాద్ : జీవితం దేనికోస‌మో, ఎవ‌రి కోస‌మో ఆగిపోద‌ని.. సాగిపోతూనే ఉంటుంద‌ని హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ అన్నారు. వినాయ‌క నిమ‌జ్జ‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు న‌గ‌ర సీపీ ట్యాంక్‌బండ్‌పైకి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డో యువ‌తి మిరుమిట్లుగొలిపే బెలూన్లు అమ్ముతూ క‌నిపించింది. యువ‌తితో ముచ్చ‌టించిన సీపీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ... వైర‌స్ సంక్షోభంలోనూ యువ‌తి జీవితం ప‌ట్ల సానుకూల‌తను చూపించింద‌న్నారు. ఆమె త‌మ‌కంద‌రికి స్ఫూర్తినిచ్చింద‌న్నారు. దేవుడు ఆ యువ‌తిని, ఈ అంద‌మైన హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఆశీర్వ‌దించుగాక అని పేర్కొన్నారు. 


logo