May Flower | పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాజారాంపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్, పెగడపల్లి మండల మాజీ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నాగుల రాజశేఖర్ గౌడ్ ఇంట్లో సంవత్సరానికి ఒకసారి అలరించే మే పుష్పం వికసించింది. గత మూడు సంవత్సరాల నుండి మే పుష్పం తన ఇంటి వద్ద పూస్తుంది అని రాజశేఖర్ పేర్కొన్నారు. ఎంతో అరుదుగా ఏడాదికి ఒక్కసారిగా, పూసే మే పుష్పాన్ని పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఈ పుష్పాలు 20 రోజుల పాటు వాడిపోకుండా ఉంటాయని, అలంకరణ కోసం వినియోగిస్తారని ఉద్యానవన శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మొక్క ఆకులు, పుష్పాలు, వేరుల్లోనూ ఔషధ గుణాలు ఉండడంతో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.