కెమిస్ట్రీ నుంచే ఎక్కువ స్కోరింగ్
- గణితం కాస్త కఠినం .. ముగిసిన జేఈఈ అడ్వాన్స్డ్
- సెప్టెంబర్ 11న ఫలితాలు .. 12 నుంచి జోసా కౌన్సెలింగ్
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ (జేఈఈ అడ్వాన్స్డ్) పరీక్షలు సజావుగా ముగిశాయి. ఆదివారం రెండు సెషన్లల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం పేపర్ -1 కన్నా, మధ్యాహ్నం పేపర్ -2 కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
గణిత ప్రశ్నల నిడివి అధికంగా ఉండగా, కెమిస్ట్రీ సులభంగా వచ్చింది. జనరల్ క్యాటగిరీ కటాఫ్ మార్కులు 70 నుంచి 75 మార్కులు ఉండవచ్చని నిపుణులు విశ్లేషించారు. మొత్తం 360 మార్కులకుగాను 340 మార్కులతో స్టేట్ టాపర్గా నిలిచే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఫలితాలు సెప్టెంబర్ 11న విడుదల కాగా, 12 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది.
పేపర్ విశ్లేషణ ఇలా..
- గణితం, ఫిజిక్స్ ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయి. కెమిస్ట్రీ సులభంగా ఇచ్చారు. కానీ నెగెటివ్ మార్కుల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడొచ్చు.
- సెక్షన్ -2లోని ప్రశ్నలు మంచి స్కోర్, ఉత్తమ ర్యాంకును సాధించేందుకు దోహదపడుతాయి. మంచి ర్యాంకును ఇదే ని ర్ణయిస్తుందని నిపుణులు అంటున్నారు.
- సెక్షన్ -2లో మార్కులు తక్కువగానే ఉన్నా మూడు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు విద్యార్థుల విలువైన సమయాన్ని వృథా చేశాయి.
పలుచోట్ల సాంకేతిక సమస్యలు
పలు పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కంప్యూటర్ తెరలపై ప్రశ్నలు సరిగ్గా కనిపించక కొంత మంది విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. మరికొన్ని కంప్యూటర్ తెరలపై ఒకే ప్రశ్న రెండు స్క్రీన్లపై ప్రత్యక్షమైంది. దీని వల్ల విద్యార్థుల సమయం వృథా అయ్యింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

