హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక శాఖలో శనివారం భారీగా బదిలీలు జరిగాయి. 18 మంది డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు (డీఎఫ్వో), 22 మంది అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ డీజీ వై నాగిరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా కమిటీ ప్రొసీడింగ్స్ ప్రకారం మల్టీజోన్ల పరిధిలో జిల్లా ఫైర్ ఆఫీసర్ స్థాయి నుంచి సాధారణ ఉద్యోగి, కానిస్టేబుళ్ల వరకూ ఈ బదిలీలు జరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డీఎఫ్వోలు, ఏడీఎఫ్వోలు, ఇతర ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని డీజీ ఆదేశించారు. మూడు రోజుల్లోపు రిపోర్టు చేయడంలో ఆలస్యమైతే వారు రిలీవ్ అయినట్టుగా పరిగణిస్తామని హెచ్చరించారు.