సూర్యాపేట : ఫీజు రియంబర్స్మెంట్స్(Fee reimbursements) కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అనేక చోట్ల విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. తాజాగా ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం సూర్యాపేట జిల్లా(Suryapet) కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం(BC Student Union) ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన(Massive student rally) చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య యాదవ్ మాట్లాడుతూ..విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు.
పై చదువులకు వెళ్లే విద్యార్థులను స్కాలర్షిప్స్ రాకపోవడంతో యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. సంక్షేమ హాస్టల్లో సొంత భావనాలు,సౌకర్యాలు లేమితో విద్యార్థులు అల్లా డుతున్నారు. ప్రభుత్వం తక్షణమే సొంత భవనాలు కట్టించి పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్, మెస్ చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 4 వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేదంటే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు..