హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితా ప్రత్యేక స వరణకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో అఖిలపక్షాలు కదంతొక్కాయి. రా ష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రా రంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియను నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేదర్ విగ్రహం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐఆర్లో లోపాలు ఉన్నాయని, ప్రజల హకులను కాలరాస్తున్నారని అఖిలపక్షాల నేతలు, కార్యకర్తలు నినదించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరుగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు, సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే నారాయ ణ, సీపీఐ రా ష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, తెలంగాణ సాంసృతిక సారథి చైర్పర్సన్ జీ వెన్నెల, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి చలపతి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనపు సీఈ వో వాసం వెంకటేశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
అర్హుల ఓట్లు తీసేయొద్ద్దు : కూనంనేని
ర్యాలీ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఓట్ల తొలగింపునకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, ఇదే సమయంలో అ ర్హులైన ప్రజల ఓట్లను తొలగించే ప్ర యత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తామ ని స్పష్టంచేశారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ఓటు హకును కాపాడటం ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమన్నారు. ఎస్ఐఆర్ను అడ్డం పెట్టుకుని తెలంగాణలో దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు ప న్నుతున్నదని సీపీఎం కార్యదర్శి జాన్‌వెస్లీ ధ్వజమెత్తారు. ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్, జాతీయ సమితి సభ్యులు పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.