నల్లగొండ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనూ ఉంది. తాజాగా జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం రావులపెంట గ్రామం నుంచి కాంగ్రెస్, సీపీఎం పార్టీలకు చెందిన వార్డు మెంబర్లతో సహా 200 మంది కార్యకర్తలు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ, ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ అందరి ముఖాల్లో ఆనందం నింపుతున్న ఘనత రాసీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షే, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీనేని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో శీలం సైదులు, యాట నాగమ్మ, రేవెల్లి రామచంద్రు, శీలం లింగయ్య, మద్దుల రవి, ఉత్తెర్ల లింగయ్య, దొంతిరెడ్డి రాంరెడ్డి, దొంతిరెడ్డి కృష్ణా రెడ్డి, ఉత్తెర్ల శ్రీను, బచ్చలకురి సైదులు, తదితరులు ఉన్నారు.
పార్టీలో చేరిన కాంగ్రెస్, సీపీఎం పార్టీలకు చెందిన కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వేములపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి, పిండి సతీష్ రెడ్డి, మిర్యాలగూడ మండల పార్టీ అధ్యక్షుడు మట్టపల్లి సైదులు యాదవ్, ఎంపీటీసీ నంద్యాల శ్రీరాం రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కందుల నాగిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సందన బొయిన చంద్రయ్య, మాలవత్ రవీందర్ నాయక్, వల్లపుదాసు వెంకటేశ్వర్లు, నిడుగొండ రామచంద్రు, తదితరులు పాల్గొన్నారు.