నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 28 : మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నాయకులు బుధవారం బీఆర్ఎస్లో భారీ గా చేరారు. జనగామలో బీజేపీకి చెందిన ఉలిగిల్ల చంద్రయ్య-స్వరూప దంపతులు, అనుచరులు, సీనియర్ నాయకుడు ఆలూరి రమేశ్‌తో బీఆర్ఎస్లో చేరారు. జనగామ మండలం చీట కోడూరుకు చెందిన సదం మదన్మోహన్ బీఆర్ఎస్లో చేరగా వీరందరికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. గద్వాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు 200 మంది బీఆర్ఎస్లో చేరారు. వీరికి సాట్స్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి హనుమంతు నాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. గద్వాల జిల్లా అయిజ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుకుమార్తోపాటు ఆయన అనుచరులు బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే విజయుడు పార్టీలోకి ఆహ్వానించారు.
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆధ్వర్యంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గుమ్ముల అంజయ్య, ఏనుగుల భూమయ్య బీఆర్ఎస్లో చేరారు. వీరికి జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు గులాబీ కండువాలు పార్టీలోకి స్వాగతించారు. 36వ వార్డుకు చెందిన ఆరుమూల మానస శివకుమార్‌తోపాటు 50 మంది బీజేపీ నాయకులు గులాబీ గూటికి చేరారు. కోరుట్ల పట్టణానికి చెందిన పద్మశాలీ సంఘం నాయకుడు, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్‌తోపాటు తోటరాజు, 25 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. వీరికి జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి మాజీ సర్పంచ్ మల్లెత్తుల అంజయ్య యాదవ్ కాంగ్రెస్‌ను వీడి సొంతగూటికి చేరారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.