నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల వారు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఆదివారం కూడా ఆయా జిల్లాల్లో గులాబీ కండువా కప్పుకొన్నారు. సూర్యాపేట పట్టణంలోని 16వ వార్డు బీజేపీ అధ్యక్షుడు మంచిగంటి హనుమంతరావుతోపాటు నాయకుడు గోరుగంటి రవీందర్రావు తదితరులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో బీజేపీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ చెన్నయ్యతోపాటు 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వనపర్తిలో 20 మంది జమ్మిచెట్టు ఆటో యూనియన్ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన ఎలబోతారం గ్రామంలోని పలువురు యువకులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ల్యాబర్తి గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే రమేశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఇటిక్యాల మండలం చాగాపురం, బుడ్డారెడ్డిపల్లె గ్రామాలకు చెందిన 70 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం సమక్షంలో, నారాయణ పేట జిల్లా కృష్ణ మండలానికి చెందిన 50 మంది టీడీపీ, బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్‌లో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో, నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని పెద్దపల్లికి 50 మంది హైదరాబాద్‌లో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో, కొడంగల్ నియోజకవర్గానికి చెందిన 70 మంది కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ నాయకులు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేం దర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్లోకి జూపల్లి వర్గీయులు..
వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం తెల్లరాళ్లపల్లిలో మాజీ మంత్రి జూపల్లి వర్గీయులైన సర్పంచ్ రేణమ్మ, వార్డు సభ్యురాలు తారక మ్మ, నాయకుడు మౌలాలితోపాటు దాదాపు 30 మంది కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.