అలంపూర్/తిమ్మాపూర్/హుజురాబాద్, జనవరి 22 : కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చక ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ఖాన్తోపాటు 100 మంది ఆ పార్టీ నాయకులు గురువారం బీఆర్ఎస్లో చేరారు. ఏపీలోని కర్నూల్లో వీరికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ ని యోజకవర్గ పరిధిలోకి వచ్చే కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు కాల్వ మల్లేశం బీఆర్ఎస్లో చేరారు.
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో పార్టీ వ రింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ పొనగంటి రాము వంద మందితో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీరికి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు.