3 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 8.705 కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరి అరెస్టు
శంషాబాద్ రూరల్, మే 20: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 8.705 కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.05 కోట్లు ఉంటుంది. అధికారుల కథనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగారు. వారి కదలికలపై అనుమానం రావడంతో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఈక్రమంలో వారివద్ద ఉన్న వాటర్ బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లను తనిఖీ చేయగా అందులోనుంచి సుమారు 8.705 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి బయటపడినట్లు పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. గంజాయిని ఎక్కడికి తరలించడానికి తీసుకొని వచ్చారనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

