హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు తమ ఉద్యమపంథా మార్చుకోవాలని, ఆయుధాలతో కాకుండా ప్రజల తో కలిసి పోరాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. సోమవారం న్యూఢిల్లీలో నారాయణ మాట్లాడుతూ.. దేశంలో హత్యలు, లైంగికదాడులు పెరుగుతున్నాయని, వాటిని నిరోధించడంపై దృష్టిపెట్టాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్షా.. మావోయిస్టుల ఏరివేత కోసం సమావేశాలు పెడుతున్నారని ఆరోపించారు.