హైదరాబాద్: వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు (Maoists) అగ్ర నేతలు లొంగుబాట పట్టారు. కేంద్ర, రాష్ట్ర కమిటీకి చెందిన సుమారు 37 మంది మావోయిస్టులు శనివారం మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ బీ. శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఎదుట లొంగిపో నున్నారు. వారిలో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. లొంగిపోతున్న వారిలో ఆజాద్, కొయ్యడ సాంబయ్య, అప్పాస్ నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.