Indiramma Indlu | వర్ధన్నపేట, మే 5 : ప్రజాప్రతినిధులకు ఇందిరమ్మ ఇండ్ల సెగ తగులుతున్నది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే పక్కా గృహాలు మంజూరవుతున్నాయని గ్రామాలకు వెళ్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రజలు వాగ్వాదానికి దిగుతున్నారు. సోమవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతాపురంలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే నాగరాజు వద్ద గ్రామానికి చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జాబితాలో అవకతవకలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని వారు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. బండౌతాపురంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన దృశ్యాలను ఫొటోలు తీస్తున్న జర్నలిస్టుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. గుర్తింపు కార్డు చూపించాలని నిలదీశారు.