హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాల కోసం ఎంతో మంది మన విద్యార్థులు అమెరికా సహా ఇతర దేశాల బాట పడతారు. అయితే, అకడ ఉద్యోగావకాశాలేంటి.. ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కొవాలన్నది ప్రస్తుతం సవాల్‌గా మారింది. ఇలాంటి సమయంలో చాలా మంది అకడి కన్సల్టెన్సీలను ఆశ్రయించి, వారి ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు.
మొదట ఈ కన్సల్టెన్సీలతో ఒప్పందం ఉపయోగకరంగా అనిపించినా తర్వాత అవే కన్సల్టెన్సీలు గుదిబండల్లా మారి మెడకు చికుకొంటాయి. ఫీజులని, ఔట్సోర్సింగ్ అని శ్రమను పిండుకొంటాయి. ఇలాంటి సమస్యకు ఓ ఇద్దరు ఎన్నారైలు చక్కటి పరిష్కారం చూపారు.
ఖమ్మం జిల్లాకు చెందిన లీలా గౌతం, తన స్నేహితుడు బాలాజీతో కలిసి అమెరికాలో ఉన్న ఉద్యోగాల సమాచారం, వాటికి దరఖాస్తు చేసేందుకు ప్రత్యేకంగా ‘ఐప్లె ఎట్ స్కేల్’ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. ఐటీ ఉద్యోగాలు వెతుకొతున్న విద్యార్థుల తరఫున స్టార్టప్ కంపెనీయే దరఖాస్తు చేయడం దీని ప్రత్యేకత. ఇప్పటివరకు 80 దరఖాస్తులు పంపించగా, 52 మందికి ఉద్యోగాలు పొందినట్టు లీలాగౌతమ్ వెల్లడించారు. వివరాలకు www.applyatscale.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.