తమకు రెండెకరాలు ఉన్నా ఇంకా రైతు భరోసా రాలేదని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం గుంటిపల్లి, దేవరపల్లి, మోట్లంపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు సోమవారం వ్యవసాయ కార్యాయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు ఆఫీస్కు రాగా.. అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకు అక్కడే వేచి ఉన్నారు. ప్రభుత్వం మూడెకరాల వరకు పంట పెట్టుబడి సాయం అందించినట్టు చెప్తున్నా రెండెకరాలు ఉన్న తమకు ఇంతవరకు ఖాతాల్లో డబ్బులు పడలేదని ఆవేదన చెందారు.
రైతుభరోసా రాలేదంటూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండాలేమూర్కు చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇటీవల గ్రామసభలు నిర్వహించి తాము సాగుచేయటంలేదనే నెపంతో రైతుబంధు ఇవ్వటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.