రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంటే ఉంటామని, మంత్రి కేటీఆర్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పలు సంఘాల వారు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం కన్వీనర్ బుర్ర నారాయణగౌడ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజక వర్గంలోని గౌడ సంఘాల నాయకులు బుధవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి మద్దతు తెలిపారు.
అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలీ సంఘం, వస్త్ర వ్యాపార సంఘం, పాలిస్టర్ అసోసియేషన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన మంత్రి కేటీఆర్‌కే ఈ ఎన్నికల్లో పూర్తి మద్దతు ఉంటుందని ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన మొత్తం 18 దళిత కుటుంబాల వారు తీర్మా నం చేశారు. అనంతరం ఈ ప్రతిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యకు అందజేశారు.