మాజీ మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీలను తొలగించడంపై పలువురు మండిపడుతున్నారు. రేవంత్ ప్రభుత్వానిది ఇదేం ద్వంద్వ వైఖరి అని నిలదీస్తున్నారు. హరీశ్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను జీహెచ్ఎంసీ సిబ్బంది రాత్రికి రాత్రే తొలగించారు.
మహనాడు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పది రోజులుగా ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను మాత్రం అలాగే ఉంచారు. అలాగే మెట్రో పిల్లర్లు, కూడళ్లలో నెలల తరబడి ఉన్న సీఎం, పీసీసీ చీఫ్ ఫొటోలు తొలగించకుండా హరీశ్‌రావు ఫ్లెక్సీలను మాత్రం తొలగించడం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.