హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసులు 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రతిభక నబర్చి 18 పతకాలతో మొదటిస్థానంలో నిలిచారు. జార్ఖండ్ రాష్ట్రంలో ని రాంచీ పట్టణంలో ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ మీట్లో తెలంగాణ పోలీసులు అత్యున్నత నైపుణ్యం, క్రమశిక్షణతోపాటు మొత్తం 18 పతకాలు గెలుచుకొని రాష్ట్ర ఖ్యాతిని పెంచారు.
ఈ పురసార ప్రదానో త్సవంలో జార్ఖండ్ ఆర్థికశాఖ మంత్రి రాధాకృ ష్ణ కిషోర్, మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఐజీ సీఐడీ (ఆర్గనైజింగ్ సెక్రటరీ) ఇతర జాతీయ స్థాయి పోలీస్ అధికారులు పాల్గొ న్నారు. తెలంగాణ పోలీస్ బృందం తరఫున సీఐడీ ఎస్పీబీ రాంరెడ్డి ‘ఓవరాల్ టీం చాంపియన్ షిప్ ట్రోఫీ’ని స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, సీఐడీ డీజీ శిఖాగోయెల్ ఈ గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘ఈ విజయానికి కారకులైన పోలీస్ సిబ్బంది, శిక్షకులు, సహా యక సిబ్బందికి హృద యపూర్వక అభినందనలు’ అని పేర్కొన్నారు.