హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఇది వీకెండ్ ప్రభుత్వమని, హెచ్సీయూ భూముల కబ్జా సహా అన్ని అక్రమాలు వీకెండ్లోనే చేస్తున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరిగిందని, అ యినా కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా ఒకమాట మాట్లాడలేదని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలను విచారణల పేరిట కాంగ్రెస్ సర్కార్ వేధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.