కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కరీంనగర్లో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ తెలంగాణకే గొప్ప మణిహారంగా నిలుస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రపంచలోనే 3 స్థానంలో నిలిచేలా ఇక్కడ వందమీటర్ల ఎత్తు లో ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదివా రం ఆయన కరీంనగర్లో మీడి యాతో మాట్లాడారు. మానేరు రివర్ ఫ్రంట్ మూడు నెలల్లో ఒక రూపానికి వస్తుందని, వచ్చే అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. సౌత్ కొరియా, చైనా తర్వాత వందమీటర్ల ఎత్తులో ఫౌంటెయిన్ నిర్మిస్తున్నామని, ఇది ప్రపంచంలోనే మూడోదిగా నిలుస్తుందని తెలిపారు.