హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణలో లోపాలు ఉన్నాయని, వాటిపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికలో ఉన్న లోపాల వల్ల మాదిగలతో పాటు మరికొన్ని దళిత కులాల హక్కులు, వాటా, అస్థిత్వం, భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని అందులో పేర్కొన్నారు.