ఆర్ఎస్పీ ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రాణాలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు.
- తక్షణమే భద్రత పెంచండి
- దళితుడిని రాజకీయంగా ఎదుర్కోలేక భద్రత కుదింపా?
- సీఎంకు మందకృష్ణ బహిరంగ లేఖ
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రాణాలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత కుదించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన సోమవారం బహిరంగ లేఖ రాశారు. మాజీ ఐపీఎస్ అధికారి, దళితుడైన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సెక్యూరిటీ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీ సుకోవడం సరికాదని స్పష్టంచేశారు. ద ళితులను రాజకీయంగా ఎదుర్కోలేక భద్ర త కుదిస్తారా? అని ప్రశ్నించారు. ఆ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని డి మాండ్ చేశారు. నాలుగు రోజుల క్రితం చట్టవిరుద్ధంగా, ఎలాంటి ముందస్తు స మాచారం లేకుండా స్పష్టమైన కారణాలు చూపకుండా ఆర్ఎస్పీ సెక్యూరిటీని తొలగిస్తున్నామని చెప్పడం దారుణమని పే ర్కొన్నారు. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
మందకృష్ణ లేఖలోని సారాంశం
‘డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే ప్రభు త్వం ఇలాంటి దిగజారుడు చర్యకు పా ల్పడుతున్నదని ఎ మ్మార్పీఎస్ బలంగా నమ్ముతున్నది. ప్రవీణ్‌కుమార్ 1995 లో ఐపీఎస్ అధికారిగా 26 ఏండ్లపాటు సుదీర్ఘకాలం సేవలందించారు. ఈ క్ర మంలో చట్ట వ్యతిరేక శక్తులు ఆయన్ను టార్గెట్ చేసుకొని, పలుమార్లు హత్యాయత్నాలు చేసిన విషయం ప్రభుత్వానికి తె లుసు. 2019లో గురుకులాల సెక్రటరీగా ఉన్న సమయంలో కొన్ని అసాంఘిక శ క్తులు దామోదర సంజీవయ్య భవన్ వద్ద రెకీ చేసి చంపాలని చూస్తే.. పోలీసులే ఛే దించి జాగ్రత్తగా ఉండాలని సూచించా రు. అందుకే బుల్లెట్‌ప్రూఫ్ వాహనంతోపాటు ఎక్స్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించా రు, ఇప్పుడు ప్రవీణ్‌కుమార్‌కు మాత్రమే కాదు; ఆయన కుటుంబసభ్యులకు కూడా ప్రాణహాని ఉన్నదని, నాటి ఇంటెలిజెన్స్ అధికారి, ప్రస్తుత హైదరాబాద్ సీపీ సజ్జనార్ నివేదికలు ఇచ్చారని వివరించారు. తన 26 ఏండ్ల పోలీసు ఉద్యోగంలో రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ అవార్డు, పోలీసు విభాగంలో అత్యున్నత శౌర్యపతకం పొందారని, అలాంటి వ్యక్తికి అకారణంగా, ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించడం అంటే, ఆయన ప్రాణాలను ప్రభుత్వమే ప్రమాదంలో పడేస్తున్నదని అర్థమవుతున్నది. ప్రవీణ్ సెక్యూరిటీని తొలగిస్తే, ఎమ్మార్పీఎస్ సహించే ప్రసక్తే లేదు’ అని ఆ లేఖలో ఆయన హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

