Manda Krishna Madiga | సీఎం రేవంత్‌రెడ్డిపై మందకృష్ణ మాదిగ మరోసారి సీరియస్ అయ్యారు. పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండదని.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండరని హెచ్చరించారు. గురువారం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మెజారిటీ ఎంపీ స్థానాలు ఎందుకు గెలవలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగలకు చేసిన మోసానికి కచ్చితంగా రేవంత్ రెడ్డి రుణం తీర్చుకుంటామని అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ ఉండదు.. రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండరని హెచ్చరించారు.