ఖైరతాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్తున్నా.. అది సంపూర్ణం కాలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ అంటే ఏబీసీడీ జరగాలని, కానీ ప్రభుత్వం అలా చేయలేదని పేర్కొన్నారు. షమీమ్ అక్తర్ కమిషన్ తప్పులతడకగా మారిందని ఆరోపించారు.
నిరుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గాంధీభవన్ సాక్షిగా ఎమ్మార్పీఎస్ నేతలపై దాష్టీకాన్ని సాగించారని.. ఫలితంగా అనేకమంది అమరులైయ్యారని గుర్తుచేశారు. మా దిగ అమరవీరులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషి యా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్ర భుత్వం షమీమ్ అక్తర్ కమిషన్ తప్పుల సవరణకు మార్చి 10 వరకు గడువు తీసుకుందని ఒకవేళ పరిష్కరించకపోతే.. 11న తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.