భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం అర్ధరాత్రి చర్ల మండలంలోని క్రాంతిపురం మడకం భద్రయ్య కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. భార్య లక్ష్మిని చితకబాదిన దుండగులు భద్రయ్యను కత్తితో పొడిచారు.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భద్రయ్యను బంధువులు భద్రాచలం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. లక్ష్మికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.