మట్టి మాఫియాకు యువకుడు బలి.. అప్పల్రావుపేట చెరువు కట్టపై బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్
మట్టి మాఫియాకు నిండు ప్రాణం బలైన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేట చెరువు కట్టపై చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. వెంకటాపురానికి చెందిన సొల్లేటి సునీల్ (41) తన ఇద్దరు కూతుళ్లను మంగళవారం నెక్కొండలోని ఆదర్శ గురుకుల పాఠశాలకు తీసుకెళ్లాడు.
- కుటుంబ సభ్యుల ఆందోళన
- 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి
నెక్కొండ, జూన్ 30 : మట్టి మాఫియాకు నిండు ప్రాణం బలైన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేట చెరువు కట్టపై చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. వెంకటాపురానికి చెందిన సొల్లేటి సునీల్ (41) తన ఇద్దరు కూతుళ్లను మంగళవారం నెక్కొండలోని ఆదర్శ గురుకుల పాఠశాలకు తీసుకెళ్లాడు. తిరిగి వస్తుండగా అప్పల్రావుపేట చెరువుకట్టపై ఎదురుగా వస్తున్న టిప్పర్ బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సునీల్‌ను స్థానికులు నర్సంపేటలోని ప్రైవేట్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. నష్టపరిహారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులతో కలిసి కుటుంబసభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు.
దీంతో నెక్కొండ-మహబూబాబాద్ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఏసీపీ రవీందర్, సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేందర్‌తోపాటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు యత్నించగా బాధితులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అండగా నిలిచారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేస్తున్న మట్టి దందాతోనే సునీల్ మృతిచెందాడని రూ. కోటి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున రూ. 5 లక్షలు విరాళంగా అందిస్తామని హామీనిచ్చారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కుటుంబసభ్యుల సమ్మతితో పోలీసులు మృతదేహాన్ని దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

