గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా (Gadwal) మల్దకల్ మండలం మల్లెందోడ్డి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్తపై వేడి నూనే పోసింది భార్య. తీవ్రంగా గాయపడిన బాధితుడు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వెంకటేశ్, పద్మ దంపతులకు 8 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భార్య భర్తలు తరుచు గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో ఈ నెల 11న ఉదయం 5 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వెంకటేశ్‌పై భార్య పద్మ సల సలా మసిలే వేడి నూనె పోసింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని గద్వాల దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం కర్నూల్లోని హాస్పిటల్ పంపించారు. కర్నూలు దవాఖానలో చికిత్స పొందుతూ వెంకటేశ్ నిన్న సాయంత్రం మరణించారు. ఘటన జరిగిన రోజే నిందితురాలు పద్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆమెను రిమాండ్‌కు తరలించారు.