హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రగతికి పాటుపడదామని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కా ర్యదర్శి హన్మంత్‌నాయక్ పిలుపు ఇచ్చారు.
గ్రూప్-1 ద్వారా 18శాఖల్లో కొత్తగా నియమితులైన 560 మందిని స్వాగతించారు. ఉద్యోగాలు పొందిన వారిని అభినందించిన వారు టీమ్‌వర్క్‌తో ప్రజాసేవకు అంకితం కావాలన్నారు. సంఘం నేతలు వే ణుమాధవ్రెడ్డి, అరవింద్‌రెడ్డి, హరికిషన్, అంజన్‌రావు, వెంకట్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.