హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వార్‌రూం బాధ్యుడిగా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవిని నిర్ధారిస్తూ హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 12న విచారణ హాజరు కా వాలని పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫొటోలతో ప్రధాని, సీఎం, మహిళలతోపాటు ఇతరులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు చేసి న కేసులో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలును సోమవారం విచారించారు. ఏసీపీ కేవీ ఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ పద్మ బృందం సునీల్‌ను విచారించింది. సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు ప్రశ్నించగా, తనకేమీ తెలియదని సునీల్ సమాధానమిచ్చాడు. తాను కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడిగా, ఒక కార్యకర్తగా, ఉద్యోగిగా మాత్రమే పని చేస్తున్నానని చెప్పాడు.
ఆ కా ర్యాలయం కాంగ్రెస్ వార్ రూమ్ అని, దా నికి ఇన్చార్జి మల్లు రవి అని వెల్లడించాడు. గంటన్నర సేపు పోలీసులు విచారించి, పలు విషయాలపై ప్రశ్నించారు. సునీ ల్‌పై కేసు నమోదైన నేపథ్యంలో మల్లు రవి గత నెల 29న సైబర్‌క్రైమ్ పోలీసులకు లేఖ రాశా రు. 2023 ఎన్నికల నేపథ్యంలో మాదాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ వార్‌రూమ్‌ను నిర్వహిస్తున్నదని, దానికి తాను ఇన్చార్జినని తెలిపారు. కేసులో తనను కూడా చేర్చాలని, విచారణకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు.