హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జే అనిరుధ్‌రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ తదితరులు హాజరై మల్లు రవికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. తనను ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.