హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి ఆరోపణలు చేస్తే బీజేపీ ఆఫీసు ముట్టిడిస్తామని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీని సన్మానిస్తామని, అమె రాకను అడ్డుకొంటే ప్రజలు తిరుగబడుతారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. గాంధీభవన్‌లో శుక్రవారం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు.