హైదరాబాద్, జనవరి 23 (నమస్తేతెలంగాణ): వేసవిలో విద్యుత్తు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌కో సీఎండీ నుంచి ఎస్ఈలకు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
ప్రజాభవన్‌లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో రెప్పపాటు కూడా కరెంట్ అంతరాయం కలుగకుండా చూడాలని పేర్కొన్నారు. పీక్ డిమాండ్‌ను తట్టుకునేలా ట్రాన్స్మిషన్ సిస్టంను బలోపేతం చేయాలని తెలిపారు.