హనుమకొండ, డిసెంబర్ 6: దళితుల దార్శనికుడు సీఎం కేసీఆర్ అని బుద్ధవనం ప్రత్యేక అధికారి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య అన్నా రు. దీక్షా దివస్‌లో భాగంగా మంగళవారం హనుమకొండలోని రెవె న్యూ గెస్ట్‌హౌస్ ఆవరణలో ‘డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆలోచన విధానం కేసీఆర్ ఆచరణ’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాసర్, మల్లెపల్లి లక్ష్మయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంబేదర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ఏర్పడిందని అన్నారు. అంటరానితనం నిర్మూలన, రాజ్యాంగం ద్వారానే అందరికీ ఓటు హకు, రిజర్వేషన్లు కల్పించిన ఘనత అంబేదర్కే దక్కిందని తెలిపారు. లేకపోతే సిరియాలో మాదిరిగా అంతర్యుద్ధం వచ్చేదని అన్నారు. కేసీఆర్‌ను మించిన ముఖ్యమంత్రి లేరని, ఏ సమయంలోనైనా దళితుల గురించి ఆలోచించే వ్యక్తి ఆయన ఒక్కరేనని కొనియాడారు.
దళితబంధు పథకం ఇప్పటిది కాదని 1997లో దళిత జ్యోతి అనే పథకాన్ని ప్రారంభించారని, ఎస్టీ సబ్‌ప్లాన్ కొనసాగింపే దళితబంధు పథకమని ఆయన పేర్కొన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని తెలిపారు. అంబేదర్ స్ఫూర్తితో 120 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కొత్తగా ప్రారంభించే సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టడం గర్వకారణం అన్నారు.