తిరుమల: మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవేంకటేశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదలు అందించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ..
‘నా పుట్టినరోజు నాడు ఏటా స్వామి వారి దర్శనానికి వస్తుంటా. గతేడాది యూనివర్సిటీలు కావాలని కోరుకున్నా. దేశంలోనే 3 పెద్ద డీమ్డ్ వర్సిటీలు నడిపిస్తున్నా. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ అభివృద్ధి చేశారు. హైదరాబాద్కు మల్టీ నేషనల్ కంపెనీలను కేటీఆర్ తీసుకొచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు. గతంలో ఏపీలో అమ్ముకుని హైదరాబాద్ వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ అవుతోంది. తెలంగాణ వాళ్లు ఏపీలో ఆస్తులు కొని వ్యాపారాలు చేస్తున్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే పాతరోజులు వస్తాయి’ అని మల్లారెడ్డి అన్నారు.
పుట్టినరోజు సందర్బంగా మేడ్చల్ నియోజకవర్గం BRS పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి తిరుపతిలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ లో పాల్గోని స్వామి వారి దివ్య దర్శనం చేసుకోవడం జరిగింది.#KCR #ktrbrs #birthday #ChMallaReddy #BRSParty #tirupati pic.twitter.com/geFZSdRT0y
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) September 9, 2025