Greta Thunberg | స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) ప్రయాణిస్తున్న సహాయ నౌకపై డ్రోన్ దాడి (drone strike) జరిగింది. గాజా (Gaza)లో మానవతాసాయం అందించేందుకు గ్రెటా థన్‌బర్గ్‌తో పాటు 44 దేశాలకు చెందిన పౌరులను తీసుకెళ్తున్న నౌకపై (Aid ship) ట్యునీషియా (Tunisia) తీరంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో గ్రెటాతోపాటూ అందులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగానే ఉన్నట్లు తెలిసింది.
జీఎస్ఎఫ్ కూడీ ఈ దాడిని ధ్రువీకరించింది. పోర్చుగీస్ జెండా కలిగి, ఫ్లోటిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులతో వెళ్తున్న నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, నౌకపై డ్రోన్ దాడి వాదనను ట్యునీషియా అధికారులు ఖండించారు. డ్రోన్ దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని తెలిపారు. నౌక లోపలి నుంచే పేలుడు సంభవించిందని నేషనల్ గార్డ్ ప్రతినిధి వెల్లడించారు.
Also Read..
Nepal | రణరంగంగా నేపాల్.. భారతీయులకు కీలక అడ్వైజరీ
Peter Navarro | భారత్‌కు మంచి ముగింపు ఉండదు.. న్యూఢిల్లీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నవారో