Anuparna Roy | వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ దర్శకురాలు సత్తా చాటింది. పశ్చిమ బెంగాల్లోని పురూలియాకు చెందిన యువ దర్శకురాలు అనూపర్ణ రాయ్ ప్రతిష్టాత్మక 82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకురాలిగా పురస్కారం అందుకుని చరిత్ర సృష్టించింది. తన తొలి చిత్రం ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ (Songs of Forgotten Trees) చిత్రానికిగాను ‘ఒరిజోంటి’ (Orizzonti) విభాగంలో ఈ అవార్డును గెలుచుకుంది. దీంతో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ దర్శకురాలిగా అనూపర్ణ రికార్డు సృష్టించింది. ఇక ఈ అవార్డును భారతీయ మహిళలందరికీ అంకితమిస్తున్నట్లు అనుపర్ణ రాయ్ పేర్కొన్నారు. అనంతరం ఇజ్రాయిల్ చేతిలో నాశనం అవుతున పాలస్తీనపై తన గొంతును విప్పారు.
‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ (Songs of Forgotten Trees) సినిమా విషయానికి వస్తే.. ముంబైకి వలస వెళ్లిన ఇద్దరు మహిళల ఒంటరితనం, మనుగడ, ఒకరికొకరు తోడుగా ఉండటం వంటి అంశాలను ఈ చిత్రం ఆవిష్కరించింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సమర్పించాడు.
Debutant Anuparna Roy won Orizzonti Award for Best Director for ‘Songs of Forgotten Trees’ at Venice Film Festival 2025. She hails from Purulia, West Bengal
Heartiest congratulations to her on this remarkable success. pic.twitter.com/uGVpjVva5b— সত্যান্বেষী (@satyanewshi) September 8, 2025