WPL 2026 Auction : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో ఎడిషన్ కోసం క్రికెటర్లను అట్టిపెట్టుకోవడం పూర్తైంది. టోర్నీ షెడ్యూల్ కూడా వచ్చేసింది. మిగిలిందల్లా మెగా వేలం మాత్రమే. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో మెరిసిన స్టార్లను కొనేందుకు ఐదు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఢిల్లీలో నవంబర్ 27న వేలం జరుగనుంది. ఈసారి 277 మంది వేలానికి వస్తున్నారు. వీళ్లలో లక్షలు కొల్లగొట్టేది ఎవరు?అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. వరల్డ్ కప్‌లో భారత్‌ను గెలిపించిన దీప్తి శర్మ (Deepti Sharma), దక్షిణాఫ్రికాను ఫైనల్ చేర్చిన లారా వొల్వార్డ్త్, రెండు శతకాలతో చెలరేగిన ఎలీసా హీలీలు.. మహిళల బిగ్‌బాష్ లీగ్(BBL 2025)లో సెంచరీతో మెరిసి మేగ్ లానింగ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ వేలంలో అత్యధిక ధర పలికే క్రికెటర్ల జాబితాలో దీప్తి శర్మ ముందు వరుసలో ఉంది. వరల్డ్ కప్‌లో టీమిండియా విజయాల్లో కీలకమైన ఈ ఆల్‌రౌండర్ రూ.50 లక్షలతో వేలంలోకి రానుంది. ఆమెతో పాటు అలీసా హీలీ(ఆస్ట్రేలియా), సోఫీ డెవినె(న్యూజిలాండ్), అమేలియా కేర్(న్యూజిలాండ్), మేగ్ లానింగ్(ఆస్ట్రేలియా)లు ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. భారత పేసర్ రేణుకా సింగ్ రూ.40 లక్షలు, లారా వొల్వార్డ్త్ రూ.30 లక్షల కనీస ధరలో వేలంలో పాల్గొంటున్నారు.
ఈసారి వేలంలో 194 మంది భారత క్రికెటర్లు, ఆస్ట్రేలియన్లు 23 మంది, ఇంగ్లండ్ నుంచచి 22మంది న్యూజిలాండ్ ప్లేయర్లు 13మంది, దక్షిణాఫ్రికా నుంచి 11మంది వేలంలో నిలిచారు. వెస్టిండీస్ నుంచి నలుగురు, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి ముగ్గురేసి క్రికెటర్లు వేలంలో పాల్గొంటున్నారు. యూఏఈ నుంచి ఇద్దరు, థాయ్‌లాండ్, యూఎస్ క్రికెటర్లు ఒక్కరేసి చొప్పున వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
The elite eight will kick off the WPL 2026 auction 💪
All details here: https://t.co/4A8yvU7WAB pic.twitter.com/Uldxbh7gBG
— ESPNcricinfo (@ESPNcricinfo) November 20, 2025
ఫ్రాంచైజీలు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నాయి. స్లాబ్స్ విషయానికొస్తే.. ఒక క్రికెటర్‌కు మాత్రమే రూ.3.5 కోట్లు చెల్లించే అవకాశముంది. రెండో ప్లేయర్‌కు రూ.2.5 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ.1.75కోట్లు, నాలుగో బ్యాటర్‌కు రూ.1 కోటి.. ఐదుగురు ప్లేయర్లకు రూ.50 లక్షలు వేలం పాట పాడాల్సి ఉంటుంది. ఒక ఫ్రాంచైజీ ఐదుగురిని అట్టిపెట్టుకుంటే వాళ్ల పర్స్ నుంచి రూ.9.75 ను తొలగిస్తారు. ఒకవేళ నలుగురిని రీటైన్ చేసుకుంటే.. రూ.8.75 కోట్లు.. ముగ్గురికి రూ.7.75 కోట్లు, ఇద్దరిని రీటైన్ చేసుకుంటే రూ.6 కోట్లు కట్ చేస్తారు.
🚨 The WPL 2026 Mega Auction pool is stacked — 277 players (83 overseas) for 73 spots (23 overseas) !
Check out the marquee set 👇#CricketTwitter pic.twitter.com/ypvuAj1bwc
— Female Cricket (@imfemalecricket) November 20, 2025
ముంబై ఇండియన్స్ : నాట్ సీవర్ బ్రంట్ (రూ.3.5 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ.2.5 కోట్లు), హేలీ మాథ్యూస్(రూ.1.7కోట్లు), అమన్‌జోత్ కౌర్(రూ.1.0కోట్లు), జి. కమలిని(రూ.50 లక్షలు). ప్రస్తుతం ముంబై పర్స్‌లో 5.75 కోట్లు ఉన్నాయంతే.
ఢిల్లీ క్యాపిటల్స్ : జెమీమా రోడ్రిగ్స్,(రూ.2.2 కోట్లు) షఫాలీ వర్మ(రూ.2.2 కోట్లు), మరినే కాప్(రూ.2.2 కోట్లు), అనాబెల్ సథర్లాండ్(రూ.2.2 కోట్లు), నిక్కీ ప్రసాద్ అన్క్యాప్డ్(రూ.50 లక్షలు). ఢిల్లీ పర్స్‌లో రూ.6.75 కోట్లు ఉన్నాయి.
యూపీ వారియర్స్ : శ్వేతా షెరావత్ (రూ.50 లక్షలు). పర్స్‌లో 14.5 కోట్లు ఉన్నాయి.
ఆర్సీబీ : స్మృతి మంధాన(రూ.3.5 కోట్లు), రీచా ఘోష్(రూ.2.75కోట్లు), ఎలీసా పెర్రీ(రూ.2 కోట్లు), శ్రేయాంక పాటిల్(రూ.60లక్షలు)లను మాత్రమే రీటైన్ చేసుకుంది. పర్స్‌లో 6.15 కోట్లు ఉన్నాయి.
గుజరాత్ జెయింట్స్ : బేత్ మూనీ(రూ.3.5కోట్లు), అష్ గార్డ్నర్(రూ.2.5కోట్లు). పర్స్‌లో రూ.9 కోట్లు ఉన్నాయి.